ఏపీలో రాజకీయాలు రసవత్తరం
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పొత్తులు ఎత్తులతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు హంగామా మొదలుపెట్టాయి. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను ఎక్కు పెడుతూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఎన్నికలు రాకముందే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తనకు ప్రాణహాని ఉందని వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాణహాని…
మాట్లాడాలని ఆటో కుర్చోపెట్టిన ప్రియుడు?
ముంబాయి/మహారాష్ట్ర: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగేశారు. పెళ్లికి ముందే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. అయితే పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నో చెప్పారు. ప్రియురాలు ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ఆటో డ్రైవర్ ను బయటకు పంపించి అదే ఆటోలో మాట్లాడుతున్న ప్రియురాలిని ఆమె ప్రియుడు గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబాయిలోని సకినాగా ప్రాంతంలో పంచశీల సమధార్ అలియాస్…
అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం.. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు వాషింగ్టన్‌కు చేరుకోనున్నారు. ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ కానున్నారు. పలువురు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మోదీ రాకకోసం ఎన్నారైలు ఉత్సాహంగా ఎదురు చూస్తోన్నారు. బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే…
నాకు నా భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడు: జానకీపురం సర్పంచ్ నవ్య!!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోమారు టార్గెట్ చేశారు. తనను మళ్ళీ ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె రచ్చ మొదలుపెట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఆపై ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మేమంతా ఒకటే అని చెప్పిన జానకీపురం మహిళా సర్పంచ్ మళ్ళీ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. గత మార్చినెలలో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్యపై తీవ్రస్థాయిలో…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం సందర్బంగా అల్లాదుర్గం zphs పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ మరియు పాఠ్య పుస్తకలు అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజి యాదవ్ మరియు ఎంపీటీసీల ఫోరం మండలఅధ్యక్షులు దశరథ్ గారు పాఠశాల ప్రాథనోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
తెలంగాణకు నైరుతి రుతుపవనాల చల్లని సంకేతాలు: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లటి సంకేతాలిచ్చాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది.
పోయిన ఫోన్లు దొరికాయి.. అందులో మీ మొబైల్ ఉందో తెలుసుకోండి..!
గత రెండు నెలల్లో తెలంగాణ పోలీసులు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) సమన్వయంతో దొంగలు దొంగిలించ మొత్తం 2219 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 19, 2023 నుంచి మొబైల్ దొంగతనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ని ఉపయోగించి పోయిన సెల్ ఫోన్లు పట్టుకుని బాధితులకు అందించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న లేదా దొంగలించబడినా బాధితులు ఫిర్యాదుల నమోదు కోసం తెలంగాణ పోలీసులు DoT సహకారంతో CEIRని ప్రవేశపెట్టారు. ఫిర్యాదు…
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: 26 నుంచి రైతుబంధు నిధులు జమ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జూన్ 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు…
నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న హిందుస్థానీ అవామ్ మోర్చా
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) సోమవారం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ తెలిపారు.జేడీయూలో తమ పార్టీని విలీనం చేయబోమని సంతోష్ స్పష్టం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన సుమన్, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఏఎంజాతీయ కార్యవర్గం సమావేశం అవుతుందని చెప్పారు.…

