వంద జన్మలెత్తినా సాధించలేరు: రాహుల్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి.…

