4news HD TV

CINEMA

దిల్ రాజు అల్లుడు కారు చోరీ.. దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంట వ్యవధిలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం రూ.1.7 కోట్ల విలువైన తన పోర్షే కారులో జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు…

TELANGANA

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్స్.. బెనిఫిట్స్ మాములుగా లేవుగా..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. ఇప్పటివరకు అందించిన ఫీచర్స్ జనాలను ఆకట్టుకున్నాయి..తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది..వాట్సాప్ బిజినెస్ ఇండికేటర్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది..యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి మెటా సర్వీసెస్‌లను కొన్ని బిజినెస్ యజమానులు ఉపయోగిస్తారు. ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. ఈ ఫీచర్ గురించి…

CINEMA

బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్

బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్ భారీగా జరగబోతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న అనిమల్ సినిమా… మేఘ్నా డైరెక్ట్ చేస్తున్న సామ్ బహదూర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ సినిమా అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు కానీ అనిమల్ మాత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే అనిమల్…

AP

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నాయి.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తు్న్నాయి.. మరోవైపు చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. చంద్రబాబు విషయంలో టీడీపీ ఆందోళన న్యాయమే అన్నారు.. ఒక రాజకీయ నాయకుడు జైల్లో ఉంటే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు..   మరోవైపు..…

CINEMA

#SDT17 ఫస్ట్ థండర్ వచ్చేస్తుంది.

యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి, తన యాక్టింగ్ కి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సాయి…

APTELANGANA

హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైల్‌పై ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్…

AP

ఏపీలో త్వరలో డీఎస్సీ ? మంత్రి బొత్స హింట్ ! జగన్ షిఫ్టింగ్, లోకేష్-షా భేటీపై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వ్రకటించారు. ప్రస్తుతం డీఎస్సికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని తెలిపారు. డీఎస్సీ వివరాలు త్వరలోనే చెప్తామని బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీ ఐఐటీలో ప్రొఫెస్సర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని బొత్స విమర్శించారు.మాట్లాడే అంశాలు…

APTELANGANA

హైదరాబాద్ నుంచి సింగపూర్ విమానాలు పెంపు, బోయింగ్ కూడా

హైదరాబాద్: సింగపూర్ దేశంలోనూ భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచే సింగపూర్ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు. అక్కడే స్థిరపడిన వారి సంఖ్యలో దక్షిణాదివాసులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సింగపూర్ దేశానికి హైదరాబాద్ నుంచి విమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది సింగపూర్ ఎయిర్‌లైన్స్. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు…

National

డీకే సంచలన వ్యాఖ్యలు, 42 మంది లీడర్స్ ఎవరు ?, ఏం జరుగుతోందని ఆరా తీస్తున్న ఢిల్లీ !

బెంగళూరు: కాంగ్రెస్‌లో (congress) చేరేందుకు ఎదురుచూస్తున్న వివిధ పార్టీలకు (BJP, JDS) చెందిన 42 మందికి పైగా నాయకులు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులు నా ముందు ఉన్నాయని. ఆ పేర్లను ఇప్పుడే వెల్లడించబోమని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) బాంబు పేల్చారు. త్వరలో ఇతర పార్టీల నాయకులు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని డీకే శికుమార్ అన్నారు. సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు…

National

చంద్రబాబుకు స్కిన్ అలర్జీ- రాజమండ్రి జైల్లో పరీక్షలు..!

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు అలర్జీ సోకినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జైలుకు చంద్రబాబు వచ్చి 33 రోజులు పూర్తయింది. ఈ…