News

TELANGANA

హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్’ సందడి షురూ..!

హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.   సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల…

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సర్వం సిద్ధం..?

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు(పార్ట్-బి)కు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యింది. రేవంత్ మంత్రివర్గం వచ్చే వారం ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు మేడ్చల్‌, జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామిర్‌పేటకు విస్తరించనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే మెట్రో కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేబినెట్ ఆమోదించనుంది.   ఈ ఏడాది జనవరి ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును నూతన సంవత్సర గిఫ్ట్‌గా ప్రకటించారు. ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు…

National

అడ్డదారుల్లో మన దేశంలోకి తన ఉత్పత్తులను పంపించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్..

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి దిగుమతులపై భారత్ పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధాన్ని తప్పించుకుని, తమ ఉత్పత్తులను ఎలాగైనా భారత మార్కెట్లోకి చేర్చేందుకు పాకిస్థాన్ ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు,…

National

ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నా వాయుసేన, నేవీ..! ప్రధానితో భేటీ..!

పహల్గమ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) సంసిద్ధత, ప్రభుత్వ ప్రతిస్పందన వ్యూహాలపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాయుసేన పరంగా అందుబాటులో ఉన్న ప్రతీకార అవకాశాలపై ప్రధానికి ఆయన వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.   ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దేశ భద్రతా పరిస్థితులు, ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతీకార చర్యల…

AP

లిక్కర్ స్కాంపై మరో బాంబు పేల్చిన కేశినేని నాని.. !

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు. ఈ మేరకు రాసిన లేఖను ఆయన…

TELANGANA

మాట్లాడుకుందాం రండి.. ఆర్టీసీ సంఘాలకు పొన్నం పిలుపు..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ ఇబ్బందులను, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల…

AP

అమరావతిలో 25 వేల జాబ్స్..! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

అమరావతిలో 25 వేల ఉద్యోగాల కల్పనకు తొలిఅడుగు పడింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రజా రాజధాని అమరావతిలో ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. ఇంతకు ఆ 25 వేల జాబ్స్ సంగతేమిటో తెలుసుకుందాం.   ఇటీవల ఏపీ ప్రజా రాజధాని అమరావతి పునః నిర్మాణానికి పీఎం మోడీ శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2027 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి…

National

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు..

భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పరస్పర సుంకాలను నివారించేందుకు ఉద్దేశించిన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే తొలి దేశాల్లో భారత్ ఒకటిగా నిలవవచ్చని వాన్స్ పేర్కొన్నారు.   భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన సమర్థవంతంగా చర్చలు జరపగలరని కొనియాడారు.…

TELANGANA

చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ రేవంత్ సర్కార్..!

తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2017 ఏప్రిల్1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర చేనేతశాఖ స్పష్టం చేసింది.…

TELANGANA

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు ..!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇంఛార్జీ మంత్రులు ఆమోదం పొందాలన్నారు.   ఇందిరమ్మ ఇళ్లు విస్తీర్ణం 600…