News

AP

చంద్రబాబు కేసుల్లో వాట్ నెక్స్ట్ – నేడే కీలకం, ఉత్కంఠ..!!.

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన సుప్రీం తీర్పు వెలువరించింది. 17ఏ పైన మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అరెస్ట్, రిమాండ్ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవించలేదు. ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.   ఫైబర్ కేసులో తీర్పు: చంద్రబాబు స్కిల్…

TELANGANA

నోటీసులపై ఈడీకి షాకిచ్చిన కవిత…

ఢిల్లీ లిక్కర్ స్కాంపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈ మెయిల్ పంపేశారు. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదంటూ కోర్టును ఆశ్రయించారు.   ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత…

TELANGANA

ప్రజాపాలనలో దరఖాస్తు చేసారా, ఏ పథకానికి మీరు అర్హులు – ఇలా చెక్ చేసుకోండి..!!

ఎన్నికల గ్యారంటీల అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి. మిగిలినవరి మార్చి 15 లోగా ప్రారంభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇక దరఖాస్తు చేసిన వారు ఏ పథకానికి అర్హులు, వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.   దరఖాస్తుల పరిశీలన: కాంగ్రెస్ ప్రభుత్వం…

AP

ఎంపీ బెల్లాన దారెటు..?

అభ్యర్ధుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. నాలుగో జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను, సర్వేలనూ ముందేసుకొని ఎవర్ని ఉంచాలో? ఎవర్నీ పక్కనపెట్టాలో? అన్నదానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఫోర్త్ లిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానకి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది..? దానిపై సదరు ఎంపీ…

AP

రాజన్న బాణంలా దూసుకొస్తున్న షర్మిల..!

ఏపీ కాంగ్రెస్‌లో అనుకున్నదే జరిగింది. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినప్పుడే ఆమెకు లైన్ క్లియర్ అయింది. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేయకుండా షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక ఇప్పుడు రాష్ట రాజకీయాల్లో.. అది కూడా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా యాక్టివ్ అవ్వనున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కార్యాచరణ ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.   వైఎస్ షర్మిలకు…

TELANGANA

భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి…

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. భూ సేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌(నార్త్) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించే ఈ రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది.   ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి…

TELANGANA

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. దావోస్‌లో ఒప్పందాలు..!

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(Fourth Industrial Revolution) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఇది ప్రారంభం కానుంది.   సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ వరల్డ్ ఎకనామిక్…

National

ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక..

దేశ ప్రజలకు టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలాంటి వాటికి స్పందించొద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) వెల్లడించింది. ఇది ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న మరో ఎత్తుగడ అని తెలిపింది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్లిపోతాయని పేర్కొంది.

AP

చంద్రబాబు స్కిల్ కేసుపై తీర్పు..

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ టీడీపీ నాయకుల్లో నెలకొంది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు తరఫు లాయర్లు, అవినీతి కేసుల్లో ఈ నిబంధన వర్తించదని సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించిన విషయం విధితమే.

AP

ఒంగోలు ఎంపీగా పోటీ, వైసీపీలో రాజీనామాల పర్వంపై మౌనం వీడిన వైవీ సుబ్బారెడ్డి..

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు విడతల్లో 59 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.   తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40…