వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ జరుపుతోంది. మరోపక్క పిటిషన్లు పడుతుంటే వాటిపై హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. ఈ కేసులో నిందితులు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు, మళ్ళీ వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిరపరాధులని ముందే తీర్పు ప్రకటించి సమాంతర విచారణ జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం…

