AP

AP

మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్.. ఆ భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్..

కాకినాడ సెజ్ పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ చొరవ తీసుకున్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారు.   1551 మంది రైతులకు మేలు కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు…

AP

కర్నూలు పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్..! ఏపీకి రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు..!

మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు. కర్నూలు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ముందుగా శ్రీశైలం వెళ్తారు. అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. అనంతరం శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరంలో కాసేపు గడుపుతారు. అనంతరం తిరిగి కర్నూలు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.…

AP

ఏపీలో ‘గూగుల్ ఏఐ హబ్’.. చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం..!

ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో ఒక కీలక అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) కుదుర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు.  …

AP

ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం..! ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు..

ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై నాలుగు సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం విధానంలో…

AP

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..! వాటిపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని, ఇందుకుగాను రూ. 86,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనుందని ప్రధానికి వివరించారు.   ఈ చారిత్రాత్మక పెట్టుబడికి సంబంధించి మంగళవారం ఢిల్లీలోనే గూగుల్ ప్రతినిధులతో…

AP

విశాఖలో గూగుల్ ఏఐ హబ్… రేపు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)…

AP

కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల సంస్థల రాకతో.. ఐటీ హబ్‌గా ఏపీ మారబోతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల నెలకొల్పేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందని సీఎం…

AP

AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు..

ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది ఆర్టిఫిషియలో తెలియడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి…ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగ తెలంగాణ టీడీపీ నేతలను గర్తుతెలియని వ్యక్తి మోసం చేశారు.   తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా గత…

AP

అలాంటి పనులు చెయ్యను.. అలా అయితే రాజకీయాలు వదిలేస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా అందించారు.   ఉప్పాడ మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై వారంలోగా నివేదిక ఇవ్వాలని…

AP

అధికారంలో ఉన్నా, లేకున్నా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం: జగన్..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్మికుల పక్షానే నిలబడతామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడమే తమ ఏకైక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం నర్సీపట్నం, విశాఖపట్నం పర్యటనలో భాగంగా తనను కలిసిన ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారు.   పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జగన్‌ను కలిసి,…