జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారు: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ..
జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాలులో ‘పోలీసు వ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిన్న జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన…

