సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో.. నీటి సంక్షోభంతో పాక్ విలవిలా..!
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో, ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు సింధు నదీ వ్యవస్థ నుంచి అందే నీటిలో భారీగా కోత పడింది. జూన్ 5న సింధు బేసిన్ నుంచి పాక్ డ్యామ్‌లకు 1,24,500 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైందని, గత ఏడాది ఇదే సమయానికి ఇది సుమారు 1,44,000 క్యూసెక్కులుగా…

