CINEMA

అక్కా చెల్లి అందాల ప్రదర్శనలో పోటా పోటీ.. ఐనా దక్కని ఆఫర్స్‌

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని మరియు శివాత్మిక లు హీరోయిన్స్ గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కూతుర్లు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు దక్కించుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం స్టార్ హీరో కూతుర్లు కనీసం సినిమాల్లో ఆఫర్స్ కూడా దక్కించుకోలేక పోతున్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు చాలా తక్కువగా వస్తుంటాయి.

శివాని మరియు శివాత్మిక ఇద్దరు కూడా ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శన చేయడంతో పాటు నటన విషయంలో తండ్రి వారసత్వం ని పునికి పుచ్చుకున్నారు. అయినా కూడా పాపం వీరిద్దరూ దురదృష్టంతో అవకాశాలను సొంతం చేసుకోలేక పోతున్నారు. అందాల ప్రదర్శన విషయంలో పోటాపోటీగా ఫోటో షూట్స్ ఇస్తున్నా కూడా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు భవిష్యత్తులో అయినా తెలుగులో కాకుండా ఇతర భాషల్లో మంచి ఆఫర్స్ దక్కించుకోవాలని రాజశేఖర్ అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు హీరోలకు ఎందుకు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించడం లేదో వారే చెప్పాలి. శివాని మరియు శివాత్మిక అడపా దడపా చిన్నా చితకా సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. పెద్ద ఛాన్స్‌ ల కోసం వారిద్దరు వెయిట్ చేస్తున్నారు.