CINEMA

కిచ్చ సందీప్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరబోతున్నాడా?

కన్నడ నాట తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్న హీరో కిచ్చ సందీప్. మాస్ జనాల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కిచ్చ సందీప్ కు.. కన్నడ నాట ఎంతో అభిమానం ఉంది. అక్కడ కిచ్చ సందీప్ ను కేవలం హీరోగానే కాకుండా, కన్నడ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా కన్నడీగులు భావిస్తుంటారు. అలాంటి కిచ్చ సందీప్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే చర్చ సాగుతోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా తిరుగులేని ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న కిచ్చ సందీప్.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే చర్చ నడుస్తోంది. తాజాగా కన్నడ కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్.. కిచ్చ సందీప్ తో భేటీ అవడం రాజకీయ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. కి

చ్చ సందీప్ ను తమ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ కానీ, హీరో కిచ్చ సందీప్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం కిచ్చ సందీప్ తో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భేటీ కేవలం మర్యాద పూర్వకమే అని అంటున్నారు. కాగా 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా కొందరు బీజేపీలోకి చేరడంతో ప్రభుత్వం కూలిపోయింది. 2019లో బీజేపీ నేతృత్వంలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కన్నడనాట ఎంతో పాపులర్ అయిన కిచ్చ సందీప్.. సీరియల్ నటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ‘తాయవ్వ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కిచ్చ సందీప్..’స్వర్శ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కిచ్చ సందీప్ పరిచయమయ్యాడు. కాగా కిచ్చ సందీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’ ఇటీవల భారీ హిట్ అవడం తెలిసిందే.