తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి. ఈ హీరో ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో ఆపసోపాలు పడి ఎట్టకేలకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు ఇండియాలోనే మొదటిసారి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా పేరు సంపాదించుకున్నారంటే అప్పట్లో ఈయనకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి చిరంజీవి (Chiranjeevi) కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో రాణించడానికి ప్రజారాజ్యం అనే పార్టీ కూడా పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా 2009 లో పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాల నుండి చిరంజీవి పోటీ చేశారు. అయితే ఈయనకు రాజకీయాలు అంతగా అచ్చి రాలేదు.
దాంతో రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చారు. ఇక ఈయన అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవారు అంటే ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి (Chiranjeevi) తన సినిమాలతో వచ్చిన పెట్టుబడిని ఎక్కువగా ఇళ్లు,ఫామ్ హౌస్ లు కొన్నారట. అంతేకాకుండా ఈయన బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విజయవాడ,వైజాగ్ వంటి నగరాలలో ఎన్నో ఇండ్లను అలాగే స్థలాలను కూడా కొనుగోలు చేశారట. ప్రస్తుతం చిరంజీవి ఆస్తి 1200 కోట్లకు పైగానే ఉందని సమాచారం. ఇదిలా ఉంటే చిరంజీవి (Chiranjeevi) కి ఇంతకంటే ఎక్కువనే ఆస్తి ఉండేదట. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పుడు చాలావరకు తన డబ్బులన్నీ కోల్పోయారట చిరంజీవి.లేకపోతే చిరంజీవి ఆస్థి అంతకంటే ఎక్కువే ఉండేదట. కేవలం చిరంజీవికి మాత్రమే కాకుండా తన కొడుకు రామ్ చరణ్ కి కూడా ఆయన ఆస్తులు ఆయనకే ఉన్నాయి. ఇక వీరిద్దరి కి కలిసి స్థిరా చరాస్తులు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.