CINEMA

భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి.

ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. అప్పుడు తెలియదు ఆమెకు.. జీవితంలో అతడే తన భర్తగా వస్తాడని.. భవిష్యత్తు ను ఎవరు ముందు చెప్పలేరు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనాలు. ఇక ప్రస్తుతం సైఫ్- కరీనా జంట లానే మంచు మనోజ్- మౌనిక రెడ్డి కూడా ఒకటి అవుతున్నారు. మనోజ్- మౌనిక ఈరోజు సాయంత్రం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరికి అంతకుముందు పెళ్లిళ్లు అయ్యాయి.

Custody: టీజర్ వస్తుంది. కాస్త ఓపిక పట్టండి.

ఇక ఇంకా చెప్పాలంటే.. మౌనిక మొదటి పెళ్ళికి మంచు మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. 2015 లో మౌనిక.. బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహమాడింది. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళిలో మనోజ్ సందడి చేశాడు. వారి పెళ్ళికి హాజరయ్యి.. వధూవరులకు శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అప్పుడు మనోజ్ కు కూడా తెలిసి ఉండదు. ఆ పెళ్లి కూతురితోనే ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడు ఆమె పెళ్ళికి గెస్ట్ గా వెళ్లిన మనోజ్ ఇప్పుడు ఆమెకు హస్బెండ్ గా మారాడు. అందుకే అంటారు పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని.. ఎవరిని ఎప్పుడు కలపాలి.. ఎప్పుడు విడదీయాలి అనేది దేవుడికి తప్ప మరెవరికి తెలియదు అని, భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా.. నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఈ జంట కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు అభిమానులు తెలుపుతున్నారు.