తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే, రజినీ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించి నెట్టింట చర్చలు సాగుతున్నాయి.
ఇప్పటికే రజినీకాంత్ నెక్ట్స్ మూవీని దర్శకుడు టిజి జ్ఞ్యానవేల్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాను కూడా రెడీ చేస్తున్నాడట రజినీ. కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీ ఓ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను లోకేశ్ తనదైన మార్క్ మేకింగ్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
రజినీకాంత్‌తో లోకేశ్ మూవీ ఎలా ఉండబోతుందా అని అప్పుడే అభిమానుల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా, లోకేశ్ ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి రజినీకాంత్, లోకేశ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.