CINEMA

: ఇలియానా కి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఆ స్టార్ హీరోయిన్ సోదరుడేనా..?

గోవా బ్యూటీ ఇలియానా గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.ఈమె జల్సా, పోకిరి, కిక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాలీవుడ్ కోలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. అయితే గత పది సంవత్సరాల నుండి సౌత్ ఇండస్ట్రీ లో సినిమాలు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం ఇలియానా చేసిన పోస్టు సంచలనం సృష్టించింది.

ఇలియానా తన సోషల్ మీడియా ఖాతాలో నేను ప్రెగ్నెంట్ తల్లి కాబోతున్నాను అంటూ పెట్టిన పోస్ట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ పోస్ట్ చూసి చాలా మంది ఇలియానా (Ileana) పెళ్లి కాకుండా తల్లి ఎలా అయింది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంద తల్లి కాబోతుంది కాబట్టే ఇన్ని రోజుల నుండి ఎలాంటి సినిమాలకు ఒప్పుకోకుండా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే గతంలో ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రు నీబోన్ (Andru nibon) తో ప్రేమలో పడి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి.

కానీ ఆ తర్వాత సంవత్సరానికి అతనికి బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వినిపించాయి. అయితే అతనితో బ్రేకప్ అయ్యాక చాలా రోజుల నుండి ఇలియానా (Ileana) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడి తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. అంతేకాదు కేవలం ఆయనతోనే కాకుండా కత్రినా కైఫ్ (Katrina kaif) ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ లకు, పార్టీలకు, పబ్బులకు అంటూ తిరుగుతున్న ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

అంతేకాదు కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ (Sebastian) ఇలియానా ఇద్దరు ప్రేమలో ఉన్నారని సహజీవనం కూడా చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.ఇలియానాకి పుట్టబోయే బిడ్డకు కూడా కత్రినా కైఫ్ సోదరుడే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో అసలు విషయం ఏంటో తెలియాలన్నా..ఇలియానా (Ileana) నిజంగా ప్రెగ్నెంట్ అవునో కాదో తెలియాలన్నా కూడా ఆమె మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిందే.. లేకపోతే ఈ వార్తలు ఆగేలా లేవు.