CINEMA

రామోజీ ని ఢీ కొడుతున్న నాగార్జున

 సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత పరిస్థితులలో సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఒక సినిమాను రూపొందించడం అంత సులభం కాదు.

అంతటి బాహుబలి లాంటి సినిమా తీశారు అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ, దానికి అనుగుణంగా లభించిన సాంకేతిక పరిజ్ఞానం. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండడంవల్లే రామోజీ ఫిలిం సిటీ చెప్పినట్టు నిర్మాణ సంస్థలు తల ఊపేవి. ఇందులో పోటీ సంస్థ లేకపోవడం వల్ల రామోజీ యాజమాన్యం ఎంత అడిగితే నిర్మాతలు అంత ఇచ్చేవారు. అయితే రామోజీరావుకు ఇప్పుడు పోటీగా నాగార్జున వస్తున్నాడు. రావడం మాత్రమే కాదు సాంకేతిక పరిజ్ఞానంలో రామోజీ ఫిలిం సిటీ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివి దానిని అమలులో పెట్టబోతున్నాడు.

క్యూబ్ సినిమాతో జట్టు

క్యూబ్ సినిమా అనేది నిర్మాతలకు కొత్తగా పరిచయం చేయనవసరం లేని పేరు.. ఈ సంస్థ తన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను సరికొత్తగా ప్రజెంట్ చేస్తుంది. ఈ సంస్థ సరాసరి ఏటా 50 నుంచి 70 సినిమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుతుంది.. అయితే ఇప్పుడు ఈ క్యూబ్ సినిమా గ్రూప్ తో అన్నపూర్ణ స్టూడియోస్ జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా హైదరాబాదులో “ది ఏ ఎన్ ఆర్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్” ఏర్పాటు చేశాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐ సి వి ఎఫ్ ఎక్స్ ( ఇన్ కెమెరా విజువల్ ఎఫెక్ట్స్) ను తెరపైకి తీసుకొచ్చాయి. దీనివల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ ప్రాసెస్ ను త్వరితగతిన చేసేందుకు వీలవుతుంది. అయితే ఇలాంటి సౌకర్యం కేవలం రామోజీ ఫిలిం సిటీ లో మాత్రమే అందుబాటులో ఉండేదని తెలుగు సినిమా వర్గాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ విధానం అమల్లోకి వస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.

2022 నుంచి..

ఈ విధానం మీద అన్నపూర్ణ స్టూడియోస్ 2022 అక్టోబర్ నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్ వీడియోలను షూట్ చేసింది. వాటిని పరిశీలించిన తర్వాత వర్క్ లో సొల్యూషన్ నాణ్యత బాగుందని ఒక అంచనాకు వచ్చింది. వీటిని ప్రాక్టికల్ వీడియోస్ గా ఫిల్మ్ మేకర్స్ కి చూపించింది. దీని పట్ల వారు కూడా సమ్మతం వ్యక్తం చేయడంతో అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా గ్రూప్ తదుపరి అడుగులు బలంగా వేసేందుకు కార్యాచరణ రూపొందించాయి. అయితే ఈ విధానం ఎటువంటి హద్దులు లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్ గోల్స్ అచీవ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే ఫిల్మ్ తీయవచ్చని అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా గ్రూప్ సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇన్నాళ్లు ఈ భాగంలో రామోజీ గ్రూప్ కింగ్ మేకర్ గా ఉండేది. అయితే ఇప్పుడు ఇందులోకి అన్నపూర్ణ స్టూడియోస్ రావడంతో పోటీ పెరిగే అవకాశం.

వీటితో ఏం చేస్తారు?