CINEMA

ఓటర్లకు గిఫ్ట్ కార్డులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచాను, మాజీ సీఎం కొడుక్కి ఝలక్ !

బెంగళూరు/రామనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వాళ్లు ఓడిపోయారు, ఓడిపోయే వారు గెలిచిపోయారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ.

కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి ఇదే రామనగర నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

అంతకు ముందు హెచ్ డీ. కుమారస్వామి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జేడీఎస్ పార్టీకి కంచుకోట అయిన రామనగర నియోజక వర్గం నుంచి తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కచ్చితంగా విజయం సాధిస్తాడని వేరే ఆలోచన లేకుండా కుమారస్వామి కొడుకును ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేయించారు. అయితే ఎవ్వరూ కూడా కలలో ఊహించని విధంగా నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు.

నిఖిల్ కుమారస్వామి మీద కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన ఇక్బాల్ హుస్సేన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ ఎలా గెలిచిపోయాడు అని అందరూ ఆలోచించారు. అయితే ఓటర్లకు భారీ మొత్తంలో తాయిలాలు ఇస్తానని ప్రామిస్ చేసిన ఇక్బాల్ హుస్సేన్ ఎమ్మెల్యే అయ్యారని ఆరోపణలు వచ్చాయి.