CINEMA

ఛీ..ఛీ. పెళ్ళై విడాకులు తీసుకున్న ముసలి హీరోతో తమన్నా సీక్రెట్ ఎఫైర్.. నిజమేనా..?

గత కొన్ని రోజులుగా తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె బాలీవుడ్ నటుడు అయినా విజయ్ వర్మ ని పెళ్లి చేసుకోబోతుందని,పెళ్లి డేట్ కూడా త్వరలోనే ప్రకటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు తమన్నా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..కానీ విజయ్ వర్మ (Vijay varma) ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని తమన్నాతో రిలేషన్ గురించి యాంకర్ ప్రశ్నించగా ఒక నవ్వు నవ్వడం తో వీరి మధ్య రిలేషన్ నిజమే అన్నట్లు మాట్లాడడంతో అందరూ వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనని, త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ భావిస్తున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే తమన్నా (Thamannah) ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోని ఒక ముసలి హీరోతో చెట్టాపట్టా లేసుకొని తిరుగుతుంది కొంతమంది ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న జనాలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బాలీవుడ్ లోని పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ ముసలి హీరోతో తమన్నా సీక్రెట్ ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమన్నా (Thamannah) ముంబైలోనే కనిపిస్తోంది.

ఇక ఆ హీరోతో కలిసి తమన్నా నైట్ పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేయడంతో కొంతమంది ఇండస్ట్రీ వాళ్లకి తమన్నా ఆ హీరోతో కలిసి ఉండటం చూసి ఒక్కొక్కరిగా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారట. దాంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్స్ అయితే తమన్నా (Thamannah) పై చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ వర్మ (Vijay varma) తో అంతా అయిపోయి మళ్లీ ఈ హీరోని తగులుకున్నావా అని ఇలా ఎన్నో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ అసలు విషయం ఏంటో తెలియకుండా ఇలా మా హీరోయిన్ గురించి దుష్ప్రచారం చేయడం ఏమీ బాగాలేదని తమన్నా అభిమానులు బాధపడుతున్నారు.ఇక తమన్నా తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.అలాగే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన జైలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది.