CINEMA

50 కోట్లకు చేరువగా ఒప్పెన్‌హైమర్

అణుబాంబు సృష్టికర్త ఒప్పెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఒప్పెన్‌హైమర్. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు పెంచడమే కాకుండా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. అయితే ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనాల ఎలా ఉందంటే?

హాలీవుడ్‌లో అగ్రనటులు రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫి తదితరులు నటించిన ఒప్పెన్‌హైమర్ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ అందుకొన్నది. ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమాకు ఇండియాలో కూడా క్రిటిక్స్ నుంచి మద్దతు లభించడంతో కలెక్షన్ల భారీగా నమోదు అయ్యాయి.

 

ఒప్పెన్‌హైమర్ సినిమాను సుమారు 100 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 820 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఇండియాలో 1200 స్క్రీన్ల రిలీజ్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి నగరాలతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 2900 షోలు ప్రదర్శించారు.

ఒప్పెన్‌హైమర్ సినిమా తొలి రోజు ఊహించినట్టే అంచనాలకు తగినట్టుగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇంగ్లీష్ వెర్షన్ 13 కోట్లు వసూలు చేయగా, హిందీ వెర్షన్ 2 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 15 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

 

ఒప్పెన్‌హైమర్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు కంటే ఎక్కువగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇంగ్లీష్ వెర్షన్ 16 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 1 కోటి రూపాయలు వసూలు చేసుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. దాంతో ఈ సినిమా రెండో రోజు 17 కోట్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నది.

ఒప్పెన్‌హైమర్ సినిమా రెండు రోజుల పుల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 15 కోట్లు, రెండో రోజు 17 కోట్ల రూపాయలతో మొత్తంగా 32 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. ఇక ఆదివారం కలెక్షన్లతో ఈ సినిమా 50 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది.