యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా న్యూ ఇయర్ కానుకగా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ వారి ఆశలు నిరాశయ్యాయి. కొత్త ఏడాది కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ లేనట్లే అని తెలుస్తోంది. మరి అభిమానులు ఫీల్ అయితే హీరోలు సైలెంట్‌గా ఉంటారా? అంటే కాదనే చెప్పాలి.
అందుకే ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరచకుండా ఎన్టీఆర్ ఒక కొత్త లుక్‌తో క్యాలెండర్ స్టిల్‌ను పంచుకున్నాడు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్లైలిష్ లుక్‌లో.. చిన్న చిరునవ్వుతో ఉన్న ఆయన్ను చూసి తెగ మురిసిపోతున్నారు. న్యూ ఇయర్ రాకనే సంతోషం వచ్చేసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే..
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు ఇటీవల ఈ మూవీ నిర్మాత కల్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు.