అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డె నవీన్(vadde naveen).ఈయన ఇప్పటి తరం వాళ్లకి చాలామందికి తెలియదు. కానీ ఈయన సినిమాల్లో నటన చూసిన చాలా మంది ఆ హీరో ఇప్పటికి కూడా సినిమాల్లో చేస్తే బాగుండు కదా అంటూ మాట్లాడుకుంటారు. ఇక వడ్డె నవీన్ తన తండ్రి నిర్మాత కావడం వల్ల ఎలాగైనా తన కొడుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఈయన నటించిన రెండో సినిమా పెళ్లి(pelli) అనే మూవీ వల్ల స్టార్ డం వచ్చింది. ఇక తన తండ్రి కోరుకున్నట్టుగానే ఆయనకు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ ఇమేజ్ కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఇక ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాల్లో ఒక్కటి కూడా హిట్టు కాలేదు. దాంతో దాదాపు దశాబ్ద కాలం పాటు ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈయన నటించిన వరుస సినిమాలో ప్లాఫులుగా అవ్వడంతో చాలామంది దర్శక నిర్మాతలు ఈయన దగ్గరికి సినిమా కథలు చెప్పడానికి రావడం మానేశారు. దాంతో మెల్లిమెల్లిగా ఆయనకు ఆఫర్లు తగ్గి చివరికి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈయన సినీ కెరియర్ అలా అవడానికి ప్రధాన కారణం ఈయన ఎంచుకున్న కథల్లో కొత్తదనం లేకపోవడం.
అంతేకాదు ఈయనకు పోటీగా నటించిన హీరోలందరి సినిమా కథల్లో కొత్తదనం అలాగే ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు తీసేవారు. కానీ ఈయన మాత్రం ఒకే రకం కథలను ఎంచుకోవడం వల్ల చాలామంది ఈయన నటించిన సినిమాలు చూడడం మానేశారు. ఇక మరొక ప్రధాన కారణం ఈయన సీనియర్ ఎన్టీఆర్(sr.ntr) పెద్ద కొడుకు రామకృష్ణ కూతుర్ని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కూడా కాపురం చేయకుండానే మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇక అప్పట్లో ఆ కుటుంబం వల్లే వడ్డె నవీన్ కెరియర్ డిస్టర్బ్ అయిందని చాలామంది దర్శక నిర్మాతలు ఆ కుటుంబానికి భయపడే వడ్డె నవీన్ కి అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాదు వడ్డే నవీన్ అభిమానులు చాలా సందర్భాలలో వారి వల్లే వడ్డె నవీన్ కెరియర్ నాశనం అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు.కానీ వడ్డే నవీన్ ప్రస్తుతం జగపతిబాబు (jagapathi babu)లాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విలన్ పాత్రలను పోషించి మళ్లీ ఇండస్ట్రీకి రియంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు చాలా మంది కోరుకుంటున్నారు.