CINEMANational

మొదటి స్థానంలో ప్రభాస్.!. రెండో స్థానంలో చినజీయరు!!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి ఆదిపురుష్ పైనే ఉంది. సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ప్రభాస్ రాముడిగా నటించడం.

ఈనెల 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మొదటిసారి టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ట్రైలర్ తో సినిమా యూనిట్ నెగెటివిటీని తగ్గించగలిగింది.

ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ వస్తోంది. చిత్ర యూనిట్ ఈ హైప్ ను వేరే లెవల్ కు తీసుకువెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ప్రి రిలీజ్ ఈవెంట్ ను కనీ వినీ ఎరగని రీతిలో చేస్తున్నారు. ప్రభాస్ తోపాటు చిత్ర యూనిట్ కు చెందిన ముఖ్యులంతా హాజరవబోతున్నారు. వారితోపాటు దేశ సినిమా రంగానికి చెందినవారు కూడా పాల్గొనబోతున్నారు.

‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎవరూ ఊహించని ఒక విశిష్ట అతిథి హాజరవబోతున్నారు. ఆయనే.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి. ఒక సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా చినజీయరు రావడం చాలా అరుదైన విషయం. ఈ వేడుకల్లో ప్రభాస్ తర్వాత అందరి దృష్టిని ఆకర్షించేంది ఆయనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. రామాయణ గాథ ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని హిందువులందరికీ దగ్గర చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

టీజర్ విడుదలైనప్పుడు వ్యతిరేకత వ్యక్తం కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ సహా అన్ని విషయాల్లోనూ చిత్ర యూనిట్ కరెక్షన్లు చేసింది. ఈ సినిమాను వ్యతిరేకించిన కొందరు రాజకీయ నాయకులను కూడా చిత్ర బృందం కలిసింది. వారితో మాట్లాడి ఆదిపురుష్ కు మద్దతు తెచ్చుకుంది. చినజీయర్ స్వామి లాంటి వ్యక్తిని ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా పిలవడంవల్ల హిందువుల్లో మరింత సానుకూలత ఈ సినిమాపై ఏర్పడుతుందని యూనిట్ భావిస్తోంది.