National

ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్డేట్ చేసుకోవటానికి ఇంకా నాలుగురోజులే సమయం.. హర్రీఅప్!!

చాలామంది ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ సమాచారంలో తప్పులు ఉన్నట్లయితే వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆధార్ కార్డులో మార్పులకు రిజిస్టర్డ్ మీసేవ, ఈసేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి 50 రూపాయలు డబ్బులు చెల్లించి మరీ చేసుకుంటారు.

 

అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వాటిని దిద్దుకోవడానికి వాటిని సరి చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్లో జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా సేవలను అందిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా ఆధార్ ను నవీకరించుకోవడానికి ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ఆధార్ ను రిజిస్టర్డ్ ఆధార్ సెంటర్ లలో మునుపటిలా అప్డేట్ చేసుకోవచ్చు.

కానీ తాజాగా జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా పోర్టల్ లో సేవలందిస్తున్న నేపథ్యంలో ఇక మై ఆధార్ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకు మనం చేయవలసింది ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆధార్ కార్డులను అప్డేట్ చేయడానికి మీరు పోర్టల్ లో కొత్త డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా my Aadhaar పోర్టల్ కు లాగిన్ అవ్వాలి.

పోర్టల్ లో లాగిన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆపై క్రిందికి స్క్రోల్ చేసి డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అప్డేట్ యాప్ లోకి వెళ్ళిన తర్వాత అప్పటికే ఉన్న అక్కడి వివరాలను సరిచేసి ఆపై హైపర్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి.

స్కాన్ చేసి పెట్టుకున్న ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ లను అప్లోడ్ చేయాలి. అప్డేట్ చేయవలసిన అంశాలను అప్డేట్ చేసిన తర్వాత మీకు 14 అంకెల అప్డేషన్ అభ్యర్థన నెంబర్ వస్తుంది. ఇది అప్డేట్ ప్రక్రియ యొక్క దశను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మొత్తం అప్ డేట్ అయిన తర్వాత అప్డేట్ అయిన ఆధార్ కార్డు అందులో జనరేట్ చేయబడుతుంది.