National

గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఢిల్లీలో నిన్న 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం వర్షపాతంలో 15% కేవలం 12 గంటల్లోనే కురిసింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈరోజు ఢిల్లీలోని మంత్రులు, మేయర్‌లు అందరూ సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించనున్నారు.

ఆదివారం సెలవును రద్దు చేసి అందరు డ్యూటీకి రావాలని అన్ని శాఖలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.గురుగ్రామ్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏల్లో అలర్ట్ జారీ చేసింది. రిడ్జ్, లోధి రోడ్, ఢిల్లీ యూనివర్సిటీలోనివరుసగా 134.5 మిమీ, 123.4 మిమీ, 118 మిమీ వర్షపాతాన్ని నమోదు అయింది. భారీ వర్షం కారణంగా పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్‌లు, హాస్పిటల్ ప్రాంగణాల్లోకి నీరు చేరింది.

ఢిల్లీలో మోకాళ్ల లోతు నీటిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం ఢిల్లీలోని శ్రీనివాసపురి ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాలలో కొత్తగా నిర్మించిన గోడ కూలిపోయింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని జఖీరా ప్రాంతంలో ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీఎఫ్‌ఎస్‌కు సమాచారం అందిన వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని వారు తెలిపారు.