ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని, పార్టీ గెలిస్తే, సీఎం పదవికి పరిగణించబడే వరుసలో బఘేల్ మొదటి స్థానంలో ఉంటారని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ఆదివారం అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో టీఎస్ సింగ్ డియో మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రిని తొలగించకపోతే ఆ వ్యక్తి జట్టును విజయపథంలో నడిపించగలడని, గెలిచిన తర్వాత కెప్టెన్‌ను ఎందుకు మార్చాలనే నమ్మకాన్ని పార్టీ కలిగి ఉందన్నారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మరో అద్భుతమైన అవకాశం ఉందని, కొందరు తమ పార్టీకి 75 ప్లస్ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారని, అయితే తన అంచనా 60 నుంచి 75 ప్లస్ మధ్య ఉంటుందని అంచనా వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుంది.
సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య గతంలో ఉద్రిక్తతలు లేవా అని అడిగిన ప్రశ్నకు.. మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, కలిసి పని చేస్తున్నామని టీఎస్ సింగ్ డియో చెప్పుకొచ్చారు. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే సరిపోయేదన్నారు. రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండనందుకు ద్రోహం చేశారా అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘దీనిని ద్రోహంగా చూడను.. హైకమాండ్ తీసుకునే నిర్ణయంగా చూస్తా.. సీఎం కాలేను.. ఫీడ్‌బ్యాక్ మేరకే హైకమాండ్ మా అందరికీ హోదా కల్పిస్తోంది.” అని ఆయన చెప్పారు. హైకమాండ్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. తనను డిప్యూటీ సీఎంగా చేయడం మునుపటి స్థానం నుంచి దిగజారిపోయారా లేదా పురోగతినా అని అడిగిన ప్రశ్నకు.. ప్రోటోకాల్ ప్రకారం, తాను ఇప్పటికే క్యాబినెట్‌లో రెండవ స్థానంలో ఉన్నానని సింగ్ డియో చెప్పారు.
ఇప్పుడు రెండున్నరేళ్లు లేవని, ఎన్నికలకు కేవలం నాలుగైదు నెలలు మాత్రమే సమయం ఉందని, గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొన్నారు. రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటానని వాగ్దానం చేశారా అనే విషయంపై సింగ్ డియో మాట్లాడుతూ, చాలా చర్చలు మూసిన తలుపుల వెనుక జరుగుతున్నాయని అన్నారు. “ఈ రెండున్నరేళ్ల (పదవీకాలం) గురించి హైకమాండ్ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు, కాబట్టి నేను ఎటువంటి వ్యాఖ్యానించలేని స్థితిలో ఉన్నాను. మూసిన తలుపుల వెనుక జరిగే చర్చల గౌరవాన్ని ఒకరు కాపాడుకోవాలి” అని సింగ్ డియో అన్నారు.