National

ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక..

దేశ ప్రజలకు టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలాంటి వాటికి స్పందించొద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) వెల్లడించింది. ఇది ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న మరో ఎత్తుగడ అని తెలిపింది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్లిపోతాయని పేర్కొంది.