National

లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం

భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.

ఈనెల 27న ప్రారంభం. కానున్న యువగళం వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు (Yuvagalam) పాదయాత్రకు(Yuvagalam) బయలుదేరిన లోకేష్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని, వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కాని వారు లేరని అన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను వైసీపీ నేతలు హరించారని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాక్షస పాలన సాగిస్తున్నారని, ఏపీలో ప్రశ్నించే ప్రతిపక్షంపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి కొత్త పరిశ్రమలు రావడంలేదని.. ఉన్నవాటిని తరిమేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.