వర్షాకాలం బెంగళూరు (bengaluru) నగరం ఎదుర్కొనే సమస్యలు, వాటిని పరిష్కరించే అధికారుల అలసత్వంపై గురువారం బెంగళూరు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వామి ఈశ్వరానందపురి (Eshwaranandapuri Swami) వివరిస్తుండగా, ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (CM Baswaraj Bommai).. స్వామీజీ నుంచి మైక్ లాక్కుని బెంగళూరు (bengaluru) నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి చెప్పుకొచ్చారు. CM snatches mic from seer: ఫేక్ హామీలిచ్చే సీఎం ను కాను.. బెంగళూరులోని మహాదేవపురలో గురువారం ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ఒక మతపరమైన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి ఈశ్వరానందపురి (Eshwaranandapuri Swami) తో పాటు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (CM Baswaraj Bommai) ఒకే వేదిక పంచుకున్నారు. ఆ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ‘ వర్షాకాలంలో, ముఖ్యంగా భారీ వర్షాలు వరదల సమయంలో బెంగళూరు (Bengaluru flood situation)లో చాలా సమస్యలు వస్తున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన అధికారులు ఆ సమయంలో అస్సలు కనిపించరు. ఆ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు చాలా హామీలు ఇచ్చారు.
కానీ ఏవీ అమలు కావడం లేదు’ అంటూ మాట్లాడుతుండగా.. పక్కనే కూర్చున్న సీఎం బొమ్మై (CM Baswaraj Bommai).. స్వామి ఈశ్వరానందపురి చేతుల్లో నుంచి మైక్ ను లాక్కున్నారు. మైక్ లాక్కని మాట్లాడుతూ ”బెంగళూరు నగరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మేం చాలా కృషి చేస్తున్నాం. నేను మిగతా ముఖ్యమంత్రులు, రాజకీయా నాయకుల వంటి వాడిని కాదు. ఫేక్ హామీలు ఇవ్వను. ఏదైనా చేస్తానని నేను హామీ ఇస్తే, ఆరునూరైనా ఆ హామీ నెరవేరుస్తా ” అంటూ గట్టిగా మాట్లాడారు. Assembly elections in Karnataka: ఈ ఏడు ఎన్నికలు కర్నాటకలో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం. మరోవైపు, జేడీయూ సహకారంతో మరోసారి అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.