ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది.
బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు ;ఏడూ. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా నమోదైంది.
మరోవైపు పెరిగిన వెండి ధరలు కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 78,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,800గా ఉండగా.. చెన్నైలో రూ. 80,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,500ల వద్ద కొనసాగుతోంది.