TELANGANA

అష్టదిగ్బంధనం – బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో, గులాబీ పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.

 

వరుస షాక్ లతో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ఎమ్మెల్యేలు మొదలు..కేసీఆర్ కు కుడి భుజంగా నడిచిన నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా వరుసగా షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ తమ పార్టీ వరంగల్ అభ్యర్దిగా ఖరారు చేసిన తరువాత కడియం శ్రీహరి కుమార్తె పార్టీ వీడారు.

 

కేకే తన కుమార్తెతో సహా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరం పైన ప్రత్యేకంగా పోకస్ చేసిన కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు మాజీ మంత్రులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్ని చేసింది. అందులో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిగా ఖరారయ్యారు.

 

కేటీఆర్ స్పందన ఇక, వరుసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల పైన కేటీఆర్ స్పందించారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.

 

ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు.. ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్‌దని చెప్పారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని పేర్కొన్నారు.

 

ఎదుర్కొనేది ఎలా ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏండ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని పేర్కొన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తామని.. పోరాట పంథాలో కదం తొక్కుతామని స్పష్టం చేశారు.

 

శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్ అని..ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ దేనని కేటీఆర్ వివరించారు.