TELANGANA

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని , జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కన పెట్టాడని , ఆ కోపం తోనే జగన్ కు దూరంగా షర్మిల ఉంటుందని ఇలా అనేక రకాల వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల వాటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సోమవారం నాటి పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల.

తనకు తన సోదరుడితో ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. తన సోదరుడితో తనకు గొడవలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. సోదరుడితో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని, అందుకు విరుద్ధంగా తెలంగాణలో పార్టీ ఎలా పెట్టుకుంటారని కేటీఆర్ అన్నట్లు షర్మిల చెప్పారు.

కేటీఆర్ చెప్పిన సామెత నిజమేనని. అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదన్నారు. తన సోదరుడితో తనకేమీ గొడవలు లేవన్నారు. అందుకే తాను ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని ఆమె తెలిపింది.