ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిన తరువాత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. కోట్లాది మంది అభిమాన క్రికెటర్లు కన్నీటి పర్యంతమయ్యారు. టోర్నీ ఆసాంతం సక్సస్ అయి..ఫైనల్ లో విఫలమవ్వటం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వారి ఆట తీరుకు ఫిదా అయిన సెలబ్రెటీలు..క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. మీవెంట మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. నేరుగా డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లిన ప్రధాని ప్లేయర్లలో ధైర్యం నింపారు. మహ్మద్ షమీని ఆత్మీయంగా హత్తుకొని ఓదార్చారు.
Advertisement
ప్రధాని ఓదార్పు ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిన టీం ఇండియా మొత్తం ఆవేదనతో నిండిపోయింది. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సిరాజ్, షమీ కన్నీటి పర్యంతమయ్యారు. వీరి పరిస్థితి చూసి ఫ్యాన్స్ కూడా ఆవేదనకు గురయ్యారు. పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మిమ్మల్ని ఇలా చూడలేం..మీ వెనుకే మేము ఉంటామంటూ భరోసా కల్పించారు. మీరు ఓడినా – గెలిచినా మీ వెంటే అంటూ ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీ టీమిండియా డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లారు. ఈ టోర్నీలో టీమిండియా క్రికెటర్ల ఆటతీరును ప్రశంసించారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని..శక్తి మేర ఆడిన టీం ఇండియా ఎప్పటికీ గర్వకారణమే అంటూ ప్రశంసించారు.
షమీని హత్తుకున్న ప్రధాని ఆ సమయంలో షమీ ఎమోషనల్ అయ్యారు. దీంతో, షమీని దగ్గరకు తీసుకున్న ప్రధాని ఆత్మీయంగా హత్తుకొని ఓదార్చారు. దీంతో, ప్రధాని కి షమీ ధన్యవాదాలు చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టు ద్వారా షమీ అభిమానులకు సందేశం ఇచ్చారు. ”దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు…అని పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం” అని షమీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు.
షమీ ఎమోషనల్ పోస్ట్ ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఐదు వికెట్ల హాల్‌తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచి అవార్డు అందుకున్నాడు. ఇలా షమీని మోదీ హత్తుకున్న ఫొటో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.