World

విధ్వంసం.. నిరసనలు.. రోడ్డు దిగ్భంధం

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) వెలుపల అరెస్టు చేయడంతో పాక్ వ్యాప్తంగా అశాంతి, గందరగోళం చెలరేగింది. నిరసనకారులు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ (GHQ)కి వెళ్లే రహదారులను అడ్డుకున్నారు. GHQ ప్రధాన గేటుపై రాళ్ళు, ఇటుకలను విసిరారు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో PTI మద్దతుదారులు విధ్వంసాన్ని సృష్టించారు.

నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB), పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడం వలన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. PTI మద్దతుదారులు సైనిక స్థావరాలు, కార్యాలయాలు, గృహాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. పాక్ భవిష్యత్తుకు ఏకైక ఆశాకిరణం అయిన ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయడం ఏ మాత్రం తగదని నిరసనకారులు చెప్పుకొచ్చారు.