దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్`(RRR) మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన సినీ కెరీర్ లో ఇప్పుడు వరకు 29 సినిమాలు చేశాడు. వీటిల్లో కొన్ని హిట్‌గా, మరికొన్ని బ్లాక్ బస్టర్ హిట్‌గా, ఇంకొన్ని ఇండస్ట్రీ హిట్ గా చిత్రాలు ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కూడా అయితే. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఒకటి ఉంది.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. `నాన్నకు ప్రేమతో`. లెక్కల మాస్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. రిలాయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
టెంపర్ వంటి సూపర్ డూపర్ హిట్ అనంతరం ఎన్టీఆర్(NTR) ఇచ్చిన చిత్రమిది. భారీ అంచనాల నడుమ 2016 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిజానికి ఈ సినిమాపై మొదట నెగటివ్ టాక్ వచ్చింది. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు రొటీన్ రివేంజ్ డ్రామా అంటూ పెదవి విరిచారు. కానీ, అనూహ్యంగా సాయంత్రానికి నెగటివ్ టాక్ కాస్త పాజిటివ్ గా మారింది.
ఫస్ట్ షో ముగియగానే అటు క్లాస్, ఇటు మాస్ తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులకు కూడా నాన్నకు ప్రేమతో(Nannaku Prematho) పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంకేముంది బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ విధ్వంసం సృష్టించారు. కేవలం యూఎస్ లోనే ఈ చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.