National

ఆహార భద్రత,సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా జీ20 సమావేశాలు.!వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి.!

హైదరాబాద్ : జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. జీ20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారన్నారని కిషన్ రెడ్డి తెలిపారు.

వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేస్తాం..: జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నాయని. 2022లో ఇండోనేషియాలో జరిగాయని, ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తర్వాత 2024లో బ్రెజీల్ లో సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశాలు చాలా కీలకమైనవని, ప్రపంచానికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేసే సమావేశాలు ఇవేనన్నారు కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వం, ప్రజలు జీ20 దేశాల సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్నారని, జీ20 సమావేశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని, దేశంలో, ప్రపంచంలోని ప్రజలు ఫాలో అవుతున్నారన్నారు కిషన్ రెడ్డి.