AP

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి

ని సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల ఆయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీబీఐ విచారణ సరిగా జరగడం లేదని ఎంపీ ఆరోపించారు. మేము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా సిల్లీ విషయాలను తీసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు.

ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలపై
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
స్పందించారు. వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తీసుకు వచ్చేందుకు సీబీఐ విచారణ చేస్తుంది తప్పితే ఇందులో రాజకీయ కోణం లేదు.. మరో దురుద్దేశం అస్సలు లేదు అంటూ కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

అవినీతి ఆరోపణలు వస్తే ఎంతటి వారికి అయినా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాల్సిందే అని.. అందులో భాగంగానే కేజ్రీవాల్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాలో కొందరు కేజ్రీవాల్‌ కు ఎలా నోటీసులు ఇస్తారు అంటూ విమర్శిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలను పరిశీలిస్తున్నట్లుగా మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముందు ముందు కేసులో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లుగా కూడా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ సీరియస్ గా వర్క్ చేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.