AP

ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారితే మేము గొర్రెల్లా రావాలా ?, మేడమ్ కు షాక్ మీద షాక్, నువ్వేపో !

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తు ఖరారు కావడంతో పార్టీలు మారడానికి ఇదే మంచి టైమ్ అని బీజేపీ (BJP) నాయకులు అనుకుంటున్నారు. అక్టోబరు 20వ తేదీన బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (dk shivakumar) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు మీరు సిద్దంగా ఉండాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ ఆమె మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

 

బీజేపీ మాజీ ఎమ్మెల్యే (MLA) కే పూర్ణిమ శ్రీనివాస్‌ బీజేపీకి (BJP) గుడ్‌బై చెప్పడానికి రంగం సిద్దంచేసుకున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ తాలూకాలోని బీరెనల్లి గ్రామ సమీపంలోని ఫామ్ హౌస్ లోని నివాసంలో గొల్ల సంఘంతో (యాదవులు) సమావేశం నిర్వహించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ ఓ స్టోరీ చెప్పారు. మా కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోనే ఉందని అన్నారు.

మా నాన్న ఏ. కృష్ణప్ప బెంగళూరులోని కేఆర్ పురం నుంచి చాలాసార్లు కాంగ్రెస్ (congress)ఎమ్మెల్యేగా విజయం సాధించారని, తరువాత మంత్రిగా పని చేశారని. కొన్ని అనివార కారణాల వల్ల వేరే పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సీఎం( CM) సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి (DCM) డీకే శివకుమార్ ఆహ్వానించారని, అయితే అప్పుడు సాధ్యం కాలేదని పూర్ణిమా శ్రీనివాస్ అన్నారు.

 

బెంగళూరులోని కేఆర్ పురం నియోజకవర్గం నుంచి తాను పోటీ చెయ్యడానికి టిక్కెట్లు ఇస్తామని అప్పుడే సిద్దరామయ్య, డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, కానీ మేము ఆటైమ్ లోకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదని, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉండడం తగదని అనుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అసలు తాను సొంతపార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో (dk shivakumar)చర్చించామని పూర్ణిమా శ్రీనివాస్ అన్నారు.

అక్టోబర్ 20వ తేదీన అధికారికంగా కాంగ్రెస్ (congress) పార్టీలో చేరుతున్నట్లు పూర్ణిమ శ్రీనివాస్ మంగళవారం ఆమె మద్దతుదారులకు చెప్పడంతో ఆ సమావేశానికి వెళ్లిన వారు షాక్ అయ్యారని వెలుగు చూసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేకపోవడంతో వచ్చే ఏడాది ఆగ్నేయ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు డీటీ శ్రీనివాస్‌కే అనుకూలమని కాంగ్రెస్ (congress)నేతలు చెబుతున్నారని, అందుకు ఆగ్నేయ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తన భర్త డీటీ శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వనున్నారని పూర్ణిమా శ్రీనివాస్ ఇదే సందర్బంలో ఆమె మద్దతుదారులకు చెప్పారు.

 

ఎమ్మెల్సీ (MLC)ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే సిద్దరామయ్యకు తాము మాట ఇచ్చామని పూర్ణిమా శ్రీనివాస్ చెప్పారు. పూర్ణిమా శ్రీనివాస్ దంపతుల తీరుపై ఆ నియోజక వర్గంలోని యాదవ సంఘం నేతలు చాలా మంది ఈ సమావేశానికి హాజరు కాకుండా ఆగ్రహం వ్యక్తం చేశారని వెలుగు చూసింది. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేస్తూ యాదవ సంఘాన్ని బలి చేసే పనిలో పూర్ణిమా, ఆమె భర్త (husband) శ్రీనివాస్ ఉన్నారని వెలుగు చూసింది.

ఇప్పటికే క్షేత్రస్థాయి కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలను సంప్రదించకుండానే వాళ్ల నిర్ణయం తీసుకోవడం బాధాకరంగా ఉందని కోందరు యాదవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే బీజేపీ (BJP) పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న పూర్ణిమా శ్రీనివాస్ పేరుకు మాత్రమే మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేశామని, మేడమ్, మేడమ్ భర్త శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరినా మేము మాత్రం బీజేపీలో (BJP)ఉంటామని సమావేశం పూర్తి అయిన తరువాత చాలా మంది మాట్లాడుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.