Editor

TELANGANA

మధ్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వ్.. అప్పటిదాకా టెన్షన్..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున ఉదయం 10:30 కు తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.   కవిత అభ్యర్ధన మానవతా కోణంలోకి రాదు తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా ఏప్రిల్ 16వరకు బెయిల్ ఇవ్వాలని…

AP

రఘురామ సీట్ ఫిక్స్, టిడిపి అభ్యర్థుల్లో మార్పులు – ఎవరెక్కెడ..!

ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే సీట్లు అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. కానీ తాజాగా టిడిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మరోసారి అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. రఘురామరాజు టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.   సీట్ల సర్దుబాటు మూడు పార్టీల ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఏపీలో పూర్తయింది ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దాని పైన నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల నుంచి…

AP

చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు చేసింది.   సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో…

National

కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ….

తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఫోన్‌ను యూజర్ గోప్యత దృష్ట్యా అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో సహకరించడానికి ఆపిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది.   సెట్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి డివైజ్ యజమాని మాత్రమే డేటాను యాక్సెస్ చేయగలరని ఆపిల్ తేల్చిచెప్పినట్లు సమాచారం.   నివేదికల ప్రకారం, కేజ్రీవాల్ ఫోన్‌ను తెరవడానికి ఈడీ అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇక తప్పేది లేక ఆపిల్…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రోజుకో విషయం వెలుగులోకి రావడంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై నోరు విప్పేందుకు నేతలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చారు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్.   ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేటీఆర్. ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించానని ఇటీవల ఓ రాజకీయ నేత మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీ..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ వేగవంతంగా నడుస్తోంది. ఈకేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishan rao) కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారించింది. రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 7 రోజుల పాటు రాధాకిషన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు.   కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చిన విషయం…

AP

జనసేనకు ఈసీ బిగ్ షాక్..!

రాష్ట్రంలో వేసవి వేడితో పాటు ఎన్నికల వేడి కూడా సెగ పుట్టిస్తోంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా సిద్ధం అంటే సిద్ధం అంటున్నాయి. ప్రచారాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. ఈ క్రమంలో ఎన్నికల్ కమిషన్ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను విడుదల…

AP

ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్​లు: ఈసీ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రూ. 11 కోట్ల నగదు, రూ. 7 కోట్ల మద్యం, రూ. 10 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.   నగదు, మద్యం, వాహనాలు తదితర అంశాలపై 3300 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు ఈసీ…

AP

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు సంచలనం..

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న సంజయ్ సింగ్‌ గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసును…

TELANGANA

కేసీఆర్‌‌కు షాక్.. కల్వకుంట్ల కుటుంబంలో మరొకరు అరెస్ట్..

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.   ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి అన్ని కోణాల నుంచీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అటు వలసలు, ఇటు అరెస్టులు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎంపీలు,…