Editor

AP

జగన్ మేనిఫెస్టో.. 2019 నవరత్నాలకు మించి – గేమ్ ఛేంజర్..!!

ఏపీ ఎన్నికల్లో గెలుపు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. మరో వైపు కాంగ్రెస్ వామపక్షాలతో మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ సమయం లో తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. తాను చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం మరోసారి గెలిపిస్తాయని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే హామీలో మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  …

AP

సీట్ల పంపకాలు పూర్తి..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన మూడు పార్టీల కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే, సీట్ల పంపకాల్లో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాన్ తగ్గడం గమనార్హం. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ ఒక సీటును బీజేపీకి ఇచ్చింది.   ఈ పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి…

National

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మమత..

దేశంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఈ షెడ్యూల్‌ను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్.. చర్యలు తీసుకుంటోంది. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ..…

TELANGANA

కేసీఆర్ పార్టీతో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్త రాజకీయ పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్పార్టీతో పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్‌ చేశారు.   బీఆర్ఎస్ పార్టీప్రస్తుతం ఏ కూటమిలోనూ లేనందున మాయావతి పొత్తుకు అంగీకరించినట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు, ఇరు పార్టీల పొత్తుపై త్వరలో కేసీఆర్‌తో తదుపరి…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.   మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం…

AP

ఎవరూ టచ్ చేయలేరు, తగ్గేదే లే – సిద్దమా, కూటమికి జగన్ సవాల్..!!

టీడీపీ కూటమి లక్ష్యంగా సీఎం జగన్ విరుచుకుపడ్డారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసారు. ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. అధికారం అంటే వ్యామోహం లేదన్నారు. అధికారం పోతుందనే భయం తనకు లేదన్నారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచిపోవాలనేదే తన తపన అని చెప్పుకొచ్చారు. అరడజను పార్టీలు తనపైన బాణాలు ఎక్కుపెట్టాయన్నారు. అయినా, తాను తగ్గేదే లే అని తేల్చి చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు.   ప్రతిపక్షాలపై ఫైర్ అద్దంకి…

AP

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ కళ్యాణ్ భేటీ..

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో కలిశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గజేంద్ర షెకావత్ ఆదివారం విజయవాడ చేరుకున్నారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం కూటమిలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.   పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా,…

National

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా..

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.   దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో…

TELANGANA

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ – అమలు ముహూర్తం ఖరారు..!!

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 శాతం ఫిట్ మెంట్ తో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 53071 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పైన ఏటా రూ 418.11 కోట్ల మేర భారం పడనుంది. ఈ నిర్ణయం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయం పైన…

TELANGANA

ఎన్నికల షెడ్యూల్ విడుదల- రేవంత్ రెడ్డి వరాలు..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం…