మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాల పెంపు,
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు… ఉద్యోగుల జీతాలతో పాటు సంక్షేమం విషయంపై కూడా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు…

