4news HD TV

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీ లపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి లపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరు మాత్రమే కాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్, నిజామాబాద్ పోలీస్…

TELANGANA

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం బండి సంజయ్‌ను కలిశారు. ఆరెపల్లితోపాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పార్టీలో చేరతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, 2009లో ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మానకొండూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత…

National

3న బీజేపీ జెండా ఎగరాలి: మోడీ అలా.. కేసీఆర్ ఇలా అంటూ అమిత్ షా

ఆదిలాబాద్: డిసెంబర్ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు. మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతుందన్నారు అమిత్ షా. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. గిరిజన వర్సిటీకి…

National

మరణించిన పూర్వీకుల ఫోటోలు ఏ దిశలో పెడితే మంచిది? తెలుసుకోండి!!

ప్రస్తుతం పితృ పక్షాలు కొనసాగుతున్నాయి. పితృ పక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వారిని ఆశీర్వదిస్తారని సనాతన ధర్మంలో చాలా బలంగా నమ్ముతారు. ఇక పితృదేవతలను పూజించేవారు, ఇళ్లల్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి? పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది? ఏ దిక్కులో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు? వంటి వివరాలను కూడా తెలుసుకోవాలి. చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం వారి జ్ఞాపకార్ధం చాలా మంది ఇళ్లల్లో ఫోటోలు…

NationalPOLITICS

కేసీఆర్ నా గురువు, ఆయన బాగుండాలి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆదిలాబాద్: తెలంగాణలో త్వరలో పేదల రాజ్యం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగిన జన గర్జన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. రాష్ట్రంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ అప్పును ఎలా తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పు కేవలం మోడీ…

AP

ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారితే మేము గొర్రెల్లా రావాలా ?, మేడమ్ కు షాక్ మీద షాక్, నువ్వేపో !

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తు ఖరారు కావడంతో పార్టీలు మారడానికి ఇదే మంచి టైమ్ అని బీజేపీ (BJP) నాయకులు అనుకుంటున్నారు. అక్టోబరు 20వ తేదీన బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (dk shivakumar) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు మీరు సిద్దంగా ఉండాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ ఆమె మద్దతుదారులకు పిలుపునిచ్చారు.   బీజేపీ మాజీ ఎమ్మెల్యే (MLA) కే పూర్ణిమ శ్రీనివాస్‌ బీజేపీకి…

National

బీజేపీ స్టీరింగ్ ఆయన చేతిలోనే: అమిత్ షా వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: ఆదిలాబాద్‌ నిర్వహించిన జనగర్జనలో సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ఎస్ సర్కారుపై చేసిన విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదన్నారు. మోడీ, అమిత్‌ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో…

National

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం

చెన్నై/బెంగళూరు: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం అయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ తో (stalin) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో కావేరి (cauvery) జలాల సమస్యపై తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) మాట్లాడుతూ తమిళనాడు వ్యవసాయానికి పునాది అయిన కావేరి…

National

భారీ వర్షాల దెబ్బతో బెంగళూరు ప్రజలకు బెంగ పట్టుకుంది. ట్రాఫిక్ సమస్యతో చిత్తడి!

కర్ణాటక రాష్ట్ర రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో (Bengaluru) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుండి పడుతున్న వర్షం (rain)సోమవారం కూడా కొనసాగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల పాటు బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరు నగరంలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించారు.   బెంగళూరులో (Bengaluru) గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు (rain)చాలవని సోమవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. బెంగళూరు నగరంలోని…

National

తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెట్రియార్‌కు చెందిన రాజేంద్రన్ యాజ్ ఫైర్ వర్క్స్ పేరిట ఓ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అందులో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది.…