News

TELANGANA

తెలంగాణకు నైరుతి రుతుపవనాల చల్లని సంకేతాలు: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లటి సంకేతాలిచ్చాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది.

National

పోయిన ఫోన్లు దొరికాయి.. అందులో మీ మొబైల్ ఉందో తెలుసుకోండి..!

గత రెండు నెలల్లో తెలంగాణ పోలీసులు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) సమన్వయంతో దొంగలు దొంగిలించ మొత్తం 2219 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 19, 2023 నుంచి మొబైల్ దొంగతనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ని ఉపయోగించి పోయిన సెల్ ఫోన్లు పట్టుకుని బాధితులకు అందించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న లేదా దొంగలించబడినా బాధితులు ఫిర్యాదుల నమోదు కోసం తెలంగాణ పోలీసులు DoT సహకారంతో CEIRని ప్రవేశపెట్టారు. ఫిర్యాదు…

TELANGANA

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: 26 నుంచి రైతుబంధు నిధులు జమ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జూన్ 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు…

NationalUncategorized

నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న హిందుస్థానీ అవామ్‌ మోర్చా

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) సోమవారం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ తెలిపారు.జేడీయూలో తమ పార్టీని విలీనం చేయబోమని సంతోష్ స్పష్టం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన సుమన్, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఏఎంజాతీయ కార్యవర్గం సమావేశం అవుతుందని చెప్పారు.…

National

RTC బస్సుల్లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వారంలో ఎన్ని లక్షల మంది లేడీఎస్ ఫ్రీగా తిరిగేశారంటే?

బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వం కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల్లో కాకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు మంగళూరు డివిజన్ లో మాత్రమే ఎంత మంది మహిళలు ప్రయాణించారు అనే విషయం వెలుగు చూసింది. కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో…

National

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం..

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. గత ఏడాది క్లబ్‌లో కలిసిన మహిళపై అత్యాచారం చేసినందుకు భారత సంతతికి చెందిన విద్యార్థిని UKలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను UKలోని కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ప్రీత్ వికల్ కు న్యాయస్థానం ఏడేళ్ల…

APCINEMATELANGANA

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన…

National

ధర్మవరం టీడీపీ అభ్యర్ధి ఖరారు – హోరా హోరీ..!!

రానున్న ఎన్నికలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నవ్ ఆర్ నెవర్ గా ప్రకటించారు. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోంది. జనసేనతో పొత్తు వేళ సీట్ల కేటాయింపు పైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈ సారి పరిటాల కుటుంబం రెండు సీట్లపైన ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో ధర్మవరం సీటు పైన నిర్ణయం జరిగింది. టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. ధర్మవరం…

APTELANGANA

ఆర్టీసీ బస్సులకు మహిళల పోటు- బస్సు డోర్ విరిచి కండక్టర్ చేతిలో పెట్టారు

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ వసతిని కల్పిస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.…