National

National

మరో 7 రోజుల్లో CAA అమలు: కేంద్ర మంత్రి..

కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా CAAని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల కాక్ ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఈ హామీ ఇచ్చారు.

National

మాల్దీవుల పార్లమెంటులో రగడ… కోడిపుంజుల్లా కలబడిన ఎంపీలు..

భారత పొరుగు దేశం, చిన్న చిన్న దీవుల సమూహమైన మాల్దీవ్స్ పార్లమెంటులో ఆదివారం ఎంపీల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు మధ్య మొదలైన వివాదం.. తన్నులు, ముష్టిఘాతాల వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   మాల్దీవ్స్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఆదివారం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. కానీ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమద్ సొలెహ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి…

National

అయోధ్య‌లో ప్రారంభ‌మైన రాగ సేవ కార్య‌క్ర‌మం..45 రోజుల‌పాటు..

అయోధ్య రామమందిరంలో బాల‌క్ రామ్ విగ్ర‌హ ప్ర‌తిష్ట అనంత‌రం భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. ఇక్క‌డి బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం ప్రారంభ‌మైంది. అయోధ్య గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఈ సంగీత ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంద‌ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు వెల్ల‌డించారు.   ఈ సంగీత ఉత్స‌వం శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని…

National

భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి గురువారం న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల నుంచి బీహార్‌లోకి ప్రవేశించేలా రూట్ ఛేంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలే ఇందుకు…

National

2036 ఒలింపిక్స్ భారత్‌లోనే..!

ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 డిసెంబరు చివరివారంలో తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకోగలిగితే.. అవి అహ్మదాబాద్‌లోనే ఉండొచ్చనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఒక దేశం.. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలంటే ఏ అర్హతలను కలిగి ఉండాలి? ఆతిథ్య దేశం విషయంలో ఒలింపిక్స్ కమిటీ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? వంటి అంశాలను…

National

అయోధ్య రాముడు.. ఇక ‘బాలక్‌ రామ్‌’గా దర్శనం..

శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir)లోని నవ నిర్మిత భవ్య మందిరంలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే, ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌ (Balak Ram)’గా పిలవనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్‌ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.   జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా పేరు పెట్టామని అరుణ్…

National

రామజ్యోతి వెలిగించిన ప్రధాని మోడీ..

చారిత్రక అయోధ్యలో సోమవారం మధ్యాహ్నం రామమందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని రాత్రికి ఇళ్లలో దీపాలు వెలిగించాలని.. దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ.. దీపాలు వెలిగించారు. శ్రీరాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు.   ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రామజ్యోతి(Ram Jyoti) అంటూ మోడీ పేర్కొన్నారు. రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట…

National

రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠోత్సవం ఆరంభం..

ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.   ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

National

మంత్రముగ్ధం రాములోరి రూపం..అయోధ్యలో ప్రాణం పోసుకోనున్న విగ్రహం ఇదే

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,…