అధికార, ప్రతిపక్ష పార్టీల హెల్ప్ లైన్ వార్, ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదని ?
బెంగళూరు: నెల రోజుల క్రితం వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అధికారంలోకి వస్తామని ఆశపడిన బీజేపీ నాయకుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్…