గూగుల్ ఆఫీస్ లో టీ, కాఫీ కట్..
చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగులకు టీ, కాఫీ ఉచితంగా ఇస్తుంటాయి, ఓ మోస్తరు కంపెనీలు బ్రేక్ ఫాస్ట్, లంచ్ కూడా ఫ్రీగా అందజేస్తాయి. అలాంటిది మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ లో ఇంకెన్ని సౌకర్యాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలో కూడా ఉద్యోగులకు మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తారు. ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్, ఉద్యోగులకు లంచ్ అందించే మైక్రో కిచెన్ సదుపాయాలు అక్కడ ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇప్పుడు కంపెనీ ఆపేసింది. ఇది టెంపరరీనా…