రేషన్ కార్డు లేనివారికీ ఆరోగ్యశ్రీ.. రేవంత్ క్యాబినెట్ కీలక నిర్ణయం..!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు అందించే ఉచిత వైద్యం పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు చేసింది. ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.…

