పవన్ కళ్యాణ్ ది అంతులేని ప్రేమ. ఆయన ప్రేమిస్తే వారి కోసం అడ్డంగా నిలబడుతాడు. అది ప్రజలైనా సరే.. తన తోబుట్టువులు అయినా సరే. మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ లో గాయపడితే అన్ని వదిలేసి ఆస్పత్రికి వచ్చిన పవన్ ఎంత విలవిలలాడాడో చూశాం. సాయిధరమ్ తేజ్ బాగు అయ్యేంత వరకూ కూడా దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అంతటి ప్రేమ పవన్ సొంతం. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అయినా ఇంకొకరు అయినా సరే పవన్ అంతులేని ప్రేమ కనబరుస్తాడు. ఇదివరకూ రాంచరణ్ తేజ్ పైనా కూడా ఇంతటి వాత్సల్యాన్ని పవన్ క
నిపించాడు. పవన్ లోని ఈ మానవతా మూర్తియే ఆయన్ను ప్రజలకు, అభిమానులకు దగ్గరి చేసింది. జనం మెచ్చిన నాయకుడిగా మలిచింది. తాజాగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమా ‘వినోదయ సీతం’ రిమేక్ మొదలైంది. ఆ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఫొటోలు రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్లో కూర్చీలో కూర్చున్న మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తొడ మీద కాలు పెట్టి భుజంపై చేయి వేసి ఆహ్లాదంగా ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటో తెగ వైరల్ అయ్యింది. మెగా అభిమానులంతా ఈ మామ అల్లుళ్ల ప్రేమకు మురిసిపోతున్నారు. ఇలా కలకలాం పవన్ సంతోషంగా ఉండాలని.. ఇలానే ప్రేమను పంచాలని తెగ షేర్లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.