భారత్ జోడో యాత్ర సందర్భంగా సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు. ఆ రోజున జరిగిన సర్టికల్ స్ట్రైక్ (Surgical strike)సరే, భారత సైన్యంలోని 19 మంది చనిపోయిన విషయం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లోనూ దిగ్విజయ్ సింగ్ ఇదే వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యల మీద ఉన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. భారత జవాన్లను కోల్పోయిన తరువాత జరిగిన మెరుపుదాడుల గురించి మోడీని అడగాలని మీడియాకు చుకలంటించారు. సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) మెరుపుదాడులకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ (Jodo Congress) చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అప్పట్లో పార్లమెంట్ లోనూ అధికార బీజేపీ పక్షాన్ని నిలదీసింది. ఇప్పుడు కూడా మెరుపుదాడులకు సంబంధించిన న్యూస్ ఉత్తదేనంటూ మోడీ ప్రభుత్వాన్ని జైరాం రమేశ్ విమర్శించారు. 2016లో జరిగిన మెరుపుదాడుల(Surgical Strikes) దాడుల గురించి పలు అనుమానాలను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. వాటి ఆధారాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంది. సాయుధ దళాల పట్ల గౌవరం ఉందని చెబుతూ 2016వ ఏడాది జరిగిన మెరుపుదాడుల అంశాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు దిగ్విజయ సింగ్ గుర్తు చేశారు.