APNational

కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి !

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు మిగిలిన ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది, సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను రాజీ చెయ్యాలని నానా తంటాలు పడిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు కర్ణాటకలో తన మార్క్ మత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం !

శనివారం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా వేసుకున్న లెక్కల ప్రకారం సిద్దరామయ్య, డీకే. శివకుమార్ తో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చెయ్యాల్సి ఉంది. తరువాత మంత్రుల సంఖ్య 20కి పడిపోయింది. క్లైమాక్స్ లో కర్ణాటకలో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో దళిత నాయకుడు కేహెచ్. మునియప్ప ఉన్నారు. 1948 మార్చి 7వ తేదీన కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కంబదహళ్లిలోని నివాసం ఉండే హనుమంతప్ప, వెంకటమ్మకు కేహెచ్. మునియప్ప జన్మించారు. న్యాయశాస్త్రం పూర్తి చేసిన కేహెచ్ మునియప్ప లాయర్ గా పని చేశారు.

సీఎం, సిద్దరామయ్య కొత్త కారు ఎన్ని కోట్లు అంటే ?, కౌంటర్ ఇస్తున్న అబిమానులు !

నాగరత్నమ్మను వివాహం చేసుకున్నారు. కేహెచ్. మునియప్ప, నాగరత్నమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 1960లో కేహెచ్ మునియప్ప రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కేహెచ్. మునియప్ప తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు, దళితుడైన కేహెచ్. మునియప్ప అంచెలు అంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

1991లో కోలారు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన మునియప్ప ఎంపీ అయ్యారు. అప్పటి నుంచి కోలారు నియోజక వర్గం నుంచి పట్టుసాధించిన కేహెచ్. మునియప్ప వరుసగా 7సార్లు కోలార్ లోక్ సభ ఎంపీగా విజయం సాధించారు. లోక్ సభలో వరుసగా 7 సార్లు ఎంపీ అయిన కేహెచ్ మునియప్ప తిరగులేని నాయకుడిగా పని చేశారు.