APTELANGANA

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం.. కానీ అక్కడ అందమైన దేవాలయం.. అందులో లక్ష్మీతో కొలువైన నరసింహాస్వామి.. బొమ్మలతో కూడిన ఇటుకలు.. బుద్ధుని చరిత్ర తెలిపే శిల్పాలు.. ఇలాంటి దేవాలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ తెలంగాణలోనూ 6వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పనే. సాధారణ సమయంలో ఇక్కడికి వెళ్లిన వారు తిరిగి వస్తారనే గ్యారంటీ కూడా లేదు. కానీ సమీప గ్రామస్తులు ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రతీ మార్చిలో జాతర నిర్వహిస్తారు.
ఆలయానికి ఒక్కసారి వచ్చిన వాళ్లు మళ్లీ మళ్లీ రావడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటీ? చరిత్ర: ప్రపంచంలోని ముఖ్యమైన మతాల్లో బౌద్ధం ఒకటి. బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 50 కోట్ల వరకు ఉంటారని అంచనా. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలలకు ఆకర్షితులై చాలా మంది బౌద్ధ మతాన్ని స్వీకరించేవారు. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని వారు విశ్వసిస్తారు. అయితే బౌద్ధ మతాన్ని ఆచరించేవారు బుద్ధుడిని శివుడికి ప్రతీకగా భావించేవారు.
ఈ క్రమంలో కొన్ని శివాలయాల్లో బుద్దుడి జీవిత చరిత్రను తెలిపే విధంగా శిల్పాలను చెక్కి ప్రతిష్టించేవారు. ఈ ఆలయంపై మహాయాన బుద్ధిజం ఎక్కువగా ప్రభావితం అయినట్లు కనిపిస్తుంది. బౌద్ధ భిక్కులే ఈ ఆలయానికి పునాది వేశారని కొందరు అంటున్నారు. ఈ ఆలయంలో దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధి సత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంది. అయితే ఇది శివుడి వగ్రహమని, హరిసేన హాయాంలోనే హిందూయిజం విస్తరించడానికి ఆలయాన్ని నిర్మించారని కొందరు చెబుతున్నారు. కానీ ఇక్కడున్న శిల్పాల ఆధారంగా దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తోంది.